శనివారం 16 జనవరి 2021
National - Nov 30, 2020 , 20:02:45

రూ.10 కోట్ల విలువైన కలప పట్టివేత

రూ.10 కోట్ల విలువైన కలప పట్టివేత

మణిపూర్‌ : మణిపూర్‌ రాష్ట్రంలో ఉక్రూల్‌ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రూ.10 కోట్ల విలువైన కలపను అస్సాం రైఫిల్స్‌ ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. కొందరు  ట్రక్కుల్లో అక్రమంగా తరలిస్తున్న కలపను  కోషు గ్రామం శివారులో గుర్తించి పట్టుకున్నారు. ఇంత మొత్తంలో కలపను ఎక్కడికి తరలిస్తున్నది తెలియ రాలేదు. సీజ్‌ చేసిన వాహనాలను, కలపను పోలీసులకు అప్పగించారు. పోలీసులు డ్రైవర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.