National
- Dec 04, 2020 , 15:07:32
భారీగా గంధపు చెక్కల పట్టివేత..ముగ్గురు అరెస్టు

భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలోని కటక్ జిల్లా దలజోడి అటవీ ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేసిన 4.6 క్వింటాళ్ల గంధపు చెక్కలను క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. టాంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కొందరు స్మగ్లర్లు గంధం చెక్కలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎన్టీఎఫ్ పోలీసులు దాడి చేశారు. స్వాధీనం చేసుకున్న గంధపు చెక్కల విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ. కోటి వరకు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఐపీసీలోని పలు సెక్షన్లతోపాటు ఒడిశా అటవీ చట్టం -1972 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- కల్తీరాయుళ్లపై కొరడాకు సిద్ధం
- ‘ప్రాపర్టీ ట్యాక్స్'తో పరిష్కారం
- పట్టభద్ర ఓటర్లు 181 %పెరుగుదల
- రిజర్వేషన్ల నిర్ణయంపై హర్షం
- ఉచితంగానే వ్యాధి నిర్ధారణ పరీక్షలు
- పాదచారులకు పై వంతెనలు
- అభివృద్ధే ధ్యేయంగా ముందుకుసాగాలి
- ట్రేడ్ లైసెన్స్ ఇక తప్పనిసరి
- వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం
- ‘వయోధికుల సమస్యలు పరిష్కరిస్తా’
MOST READ
TRENDING