సోమవారం 25 మే 2020
National - Jan 22, 2020 , 20:17:06

ఐదు లారీలు.. ఐదు ట్రాక్టర్లు సీజ్‌..

ఐదు లారీలు.. ఐదు ట్రాక్టర్లు సీజ్‌..

ఐదు లారీలను, మరో ఐదు ట్రాక్టర్లను కర్ణాటక అటవీశాఖ అధికారులు సీజ్‌ చేశారు.

కర్ణాటక: ఐదు లారీలను, మరో ఐదు ట్రాక్టర్లను కర్ణాటక అటవీశాఖ అధికారులు సీజ్‌ చేశారు. వివరాల్లోకెళ్తే.. శివమొగ్గలోని మైనింగ్‌ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్‌ చేస్తున్నారన్న సమాచారం అందుకున్న ఫారెస్ట్‌ అధికారులు.. రైడిండ్‌ చేశారు. అక్కడ అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు లారీలను, ఐదు ట్రాక్టర్లను వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మంగళవారం కూడా ఇదే ప్రాంతంలో 17 వాహనాలను సీజ్‌ చేసిన అధికారులు, 10 మందిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఫారెస్ట్‌ అధికారులు మాట్లాడుతూ.. అక్రమంగా మైనింగ్‌ చేసే ఏ వాహనాన్నైనా, అతడికి ఎవరి అండదండలున్నా సీజ్‌ చేస్తామని, వాహనదారులను సైతం అరెస్ట్‌ చేస్తామని హెచ్చరించారు. 


logo