గురువారం 28 మే 2020
National - May 10, 2020 , 13:41:28

దొరికిపోయాన‌నుకుంది..కానీ..వీడియో

దొరికిపోయాన‌నుకుంది..కానీ..వీడియో

ఓ సముద్రంలో నుంచి పెద్ద సంఖ్య‌లో సీల్‌లు తీరానికి వ‌చ్చాయి. మ‌ళ్లీ అవ‌న్నీ తిరిగి సముద్రంలోకి ప‌రుగులు పెట్టాయి. అయితే అన్నీ ఎంచ‌క్కా నీటిలోకి పారిపోతుంటే ఓ సీల్ మాత్రం చాలా క‌ష్ట‌ప‌డుతూ ముందుకెళ్తుంది. ఇది గ‌మ‌నించిన అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి సీల్ ను ప‌ట్టుకున్నాడు.

ఆ సీల్ త‌న ‌ప్రాణం పోయిన‌ట్లేననుకుందో ఏమో..మ‌నిషి చేతికి చిక్కాన‌నుకొని తెగ భ‌య‌ప‌డి పోయింది. స‌ద‌రు వ్య‌క్తి మాత్రం ఆ సీల్ కు చుట్టుకున్న వ‌ల‌ను క‌ట్ చేసి..దాన్ని సముద్రంలోకి వ‌దిలిపెట్టాడు. దీంతో సీల్ చెంగుచెంగున స‌ముద్రంలోకి ప‌రుగులు పెట్టింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo