శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 13:01:21

వానా కాలంలో పెరిగిన విత్తిన విస్తీర్ణం... పంటల వారీగా వివరాలు

వానా కాలంలో పెరిగిన విత్తిన విస్తీర్ణం... పంటల వారీగా వివరాలు

ఢిల్లీ : కరోనా సంక్షోభ సమయంలోనూ వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ విభాగం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ ఏడాది వానా కాలం పంటలలో విత్తిన విస్తీర్ణం సంతృప్తికరమైన పురోగతి కనిపిస్తున్నది. వానా కాలం పంటల విత్తిన విస్తీర్ణం జులై 31నాటికి 882.18 లక్షల హెక్టార్లలో విత్తనాలు, నాట్లు పడ్దాయి. గతేడాది ఇదే కాలంలో విత్తిన విస్తీర్ణం 774.38 లక్షల హెక్టార్లు. ఆ విధంగా నిరుటి కంటే దేశంలో 13.92 శాతం విస్తీర్ణం ఎక్కువగా ఈ ఏడాది విత్తన విస్తీర్ణం పెరిగింది. పంటల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి: వరి:  నిరుడు ఇదే కాలంలో 223.96 లక్షల హెక్టార్లలో నాట్లు పడగా ఈ ఏడాది 266.60 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు.

పప్పు ధాన్యాలు: నిరుడు ఇదే కాలంలో 93.84 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయగా ఈ ఏడాది 111.91 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. తృణ ధాన్యాలు: నిరుడు ఇదే కాలంలో 139.26 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయగా ఈ ఏడాది 148.34 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. నూనె గింజలు: నిరుడు ఇదే కాలంలో 150.12 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయగా ఈ ఏడాది 175.34 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. చెరకు: నిరుడు ఇదే కాలంలో 51.20 లక్షల హెక్టార్లలో నాట్లు పడగా ఈ ఏడాది 51.78 లక్షల హెక్టార్లలో నాట్లు వేశారు.

జనపనార: నిరుడు ఇదే కాలంలో 7.05 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయగా ఈ ఏడాది 6.95 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. ప్రత్తి: నిరుడు ఇదే కాలంలో 108.95 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేయగా ఈ ఏడాది 121.25 లక్షల హెక్టార్లలో విత్తనాలు వేశారు. కాబట్టి మొత్తంగా చూస్తే జులై 31వరకూ  కోవిడ్-19 ప్రభావం ఖరీఫ్ పంటల మీద ఎలాంటి ప్రభావమూ చూపలేదు.logo