సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 17:57:31

వాతావరణ సమాచారాన్ని ఇప్పుడు ‘మౌసం’లో చూడండి

వాతావరణ సమాచారాన్ని ఇప్పుడు ‘మౌసం’లో చూడండి

న్యూ ఢిల్లీ : ఇప్పుడు ప్రజలు వాతావరణ సమాచారాన్ని ‘మౌసం’లో చూడవచ్చు. ఇది సరికొత్త మొబైల్‌ యాప్‌. వారంలో అన్ని ప్రస్తుత వాతావరణ సూచనలను ఇది అందిస్తుంది. ప్రతి 10 నిమిషాలకు రాడార్ ఆధారిత సూచనలను కూడా నవీకరిస్తుంది. 145 సంవత్సరాల నాటి ఇండియా వాతావరణ శాఖ (ఐఎమ్‌డీ) ప్రారంభించిన మొదటి యాప్ ఇది. 

భూ శాస్ర్తాల మంత్రిత్వ శాఖ ఐఎమ్‌డీ స్థాపించిన రోజైన సోమవారం ఈ యాప్‌ను విడుదల చేసింది. ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోగల ఈ యాప్ ప్రజల కోసం ఆవిష్కరించింది. సాంకేతిక పరిభాష లేకుండా వాతావరణ సమాచారం, సూచనలను స్పష్టమైన పద్ధతిలో అందించడానికి ఇది రూపొందించబడిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. 

మౌసం యాప్‌ 200 నగరాలకు ప్రస్తుత ఉష్ణోగ్రత, తేమ, గాలి వేగం, గాలి దిశ వంటి సేవలను అందిస్తుంది. సమాచారం రోజుకు ఎనిమిది సార్లు నవీకరించబడుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, చంద్రోదయం, మూన్‌ సెట్‌ గురించిన సమాచారాన్ని కూడా తెలియపరుస్తుంది. స్థానిక వాతావరణ  పరిస్థితుల గురించి మూడు గంటల ముందే హెచ్చరించడంతో పాటు 800 స్టేషన్లకు వాటి తీవ్రతను తెలియపరుస్తుంది. 24 గంటలు, ఏడు రోజుల్లో 450 నగరాలకు వాతావరణ పరిస్థితులను సూచిస్తుందని భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం. రాజీవన్ అన్నారు.

ఈ యాప్‌ను ఇక్రిసాట్‌ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ యూత్ టీం, పూణేలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ (ఐఐటీఎం), ఐఎండీ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశాయి. ఇదిలా ఉండగా ఐఎండీ ఇదివరకే ’మేఘదూత్‌’అనే ఒక యాప్‌ను ప్రవేశపెట్టగా ఇది కేవలం రైతులకు మాత్రమే అని తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo