న్యూఢిల్లీ: లక్షద్వీప్‌కు చెందిన ఫిల్మ్ మేకర్, సామాజిక కార్యకర్త అయిషా సుల్తానాపై ఇవాళ దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. విద్వేషపూరితంగా మాట్లాడినట్లు కూడా ఆమెపై కేసు బుక్ చేశారు. ఓ టీవీ చర్చలో పాల్గొన్న ఆమె .. లక్షద్వీప్ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కోవిడ్19ను జీవాయుధంగా వదిలినట్లు ఆరోపించారు. లక్షద్వీప్‌లో ఉన్న అడ్మినిస్ట్రేటర్ పటేల్‌ను ఆమె బయోవెపన్ అని సంబోధించారు. కావరట్టి పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ అయ్యింది. బీజేపీ యూనిట్ అధ్యక్షుడు సీ అబ్దుల్ ఖాదిర్ హజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సెడిషన్ సెక్షన్ 124ఏ కింద ఆమెపై కేసు ఫైల్ చేశారు. ఇటీవల మీడియావన్టీవీ అనే మళయాళీ ఛానల్‌తో సుల్తానా మాట్లాడుతూ.. లక్షదీవులపై ప్రఫూల్ పటేల్‌ను కేంద్రం ఓ జీవాయుధంగా వాడుతున్నట్లు ఆరోపించారు.