గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 20, 2020 , 18:55:05

అత్యాచార బాధితురాలికి 24 గంటలు సెక్యూరిటీ..

అత్యాచార బాధితురాలికి 24 గంటలు సెక్యూరిటీ..

భడోహి: యూపీలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ త్రిపాఠి సహా మరో ఆరుగురిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులను విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూపీ ప్రభుత్వం బాధిత మహిళకు భద్రతను ఏర్పాటు చేసింది. ముగ్గురు కానిస్టేబుళ్లతో బాధిత మహిళకు 24గంటలపాటు రక్షణ కల్పిస్తారని ఎస్పీ రాంబదన్‌ సింగ్‌ తెలిపారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ త్రిపాఠి అతని బంధువు సందీప్‌ తివారితోపాటు మరో ఐదుగురు 2017లో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని 40 ఏళ్ల వితంతువు పోలీసులను ఆశ్రయించింది. భడోహిలోని పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ ముగ్గురి కుమారుల పేర్లు కూడా ఉండటం గమనార్హం. 


logo
>>>>>>