మంగళవారం 31 మార్చి 2020
National - Mar 19, 2020 , 15:58:28

కాంగ్రెస్‌, బీజేపీ ఆఫీసుల వద్ద భారీ భద్రత

కాంగ్రెస్‌, బీజేపీ ఆఫీసుల వద్ద భారీ భద్రత


భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కొన్ని రోజులుగా అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం కమల్‌నాథ్‌ నేత్వత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో..బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రమాడా హోటల్‌లో ఉన్న 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కలవాలంటూ ఇప్పటికే దిగ్విజయ్‌సింగ్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతలు బీజేపీ కార్యాలయాల ఎదుట ఆందోళనలు నిర్వహించారు.

బీజేపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్‌ కార్యకర్తలను ప్రతిఘటించేందుకు ఆందోళనలు చేపట్టారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా బీజేపీ, కాంగ్రెస్‌ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉన్న పోలీసులతోపాటు మరో 200 మంది పోలీసులతో రెండు పార్టీల కార్యాలయాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు భోపాల్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసులు ఇర్షద్‌బాలి తెలిపారు. 


logo
>>>>>>