మంగళవారం 31 మార్చి 2020
National - Mar 03, 2020 , 11:14:38

బారికేడ్‌ను ఢీకొట్టిన ఎంపీ కారు.. పార్ల‌మెంట్‌లో హైఅలర్ట్‌

బారికేడ్‌ను ఢీకొట్టిన ఎంపీ కారు.. పార్ల‌మెంట్‌లో హైఅలర్ట్‌

హైద‌రాబాద్‌:  పార్ల‌మెంట్‌లో ఇవాళ సెక్యూర్టీ సైర‌న్ మోగింది.  గేట్ నెంబ‌ర్ వ‌న్ వ‌ద్ద .. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోన‌క‌ర్ కారు.. బూమ్ బారియ‌ర్‌ను ఢీకొట్ట‌డంతో.. అక్క‌డ ఉన్న సెక్యూర్టీ అంతా అల‌ర్ట్ అయ్యారు.  బూమ్ బ్యారికేడ్‌ను కారు అనుకోకుండా తాక‌డం వ‌ల్ల‌.. దాని నుంచి స్పైక్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  దీంతో కారు అక్క‌డే నిలిచిపోయింది. అయితే స్పైక్స్ బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌మ‌యంలో.. సెక్యూర్టీ సైర‌న్ మోగింది. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉండే భ‌ద్ర‌తా ద‌ళాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.  వెంట‌నే వాళ్లంతా పొజిష‌న్ తీసుకున్నారు. 2001లో పార్ల‌మెంట్‌పై ఉగ్ర‌దాడి జ‌రిగిన త‌ర్వాత‌.. గేట్ల వ‌ద్ద స్పైక్స్‌ల‌ను అమ‌ర్చారు. అయితే ఇదే త‌ర‌హా ప్ర‌మాదం గ‌త ఏడాది కూడా జ‌రిగింది. మ‌ణిపూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ కారు బారికేడ్ల‌ను ఢీకొట్ట‌డంతో.. గేటు వ‌ద్ద ఉన్న స్పైక్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  దీంతో ఆ ఎంపీ కారు డ్యామేజ్ అయ్యింది. కానీ ఆ ఘ‌ట‌న స‌మ‌యంలో కారులో ఎంపీ లేరు. logo
>>>>>>