శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Sep 09, 2020 , 18:11:24

రాష్ట్ర‌ప‌తి భ‌వన్‌లో సెక్యూరిటీ గార్డు ఆత్మ‌హ‌త్య‌

రాష్ట్ర‌ప‌తి భ‌వన్‌లో సెక్యూరిటీ గార్డు ఆత్మ‌హ‌త్య‌

న్యూఢిల్లీ: రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో సెక్యూరిటీ విధులు నిర్వ‌హిస్తున్న బ‌హ‌దూర్ థాపా అనే ఆర్మీ జ‌వాన్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ క్వార్ట‌ర్స్‌లోని C బ్యార‌క్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. బుధ‌వారం తెల్ల‌వారుజామున బ్యార‌క్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న బ‌హ‌దూర్ మృత‌దేహాన్ని తోటి సిబ్బంది గ్ర‌హించి కింద‌కు దించారు. అనంత‌రం క‌న్నాట్ ప్లేస్‌లోని బేస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప‌రిశీలించి అత‌ను అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు ధృవీక‌రించారు.   

కాగా, మృతుని ద‌గ్గ‌ర ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భించ‌లేద‌ని, అత‌ని ఆత్మ‌హ‌త్య‌కుగ‌ల కార‌ణం తెలియాల్సి ఉంద‌ని అధికారులు తెలిపారు. అయితే, ఇటీవ‌ల అత‌ను తీవ్ర‌మైన క‌డుపు నొప్పి, అధిక ర‌క్త‌పీడ‌నం స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని వారు వెల్ల‌డించారు. ఘ‌ట‌న‌పై క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర్ కోడ్‌లోని సెక్ష‌న్ 174 కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo