మంగళవారం 02 మార్చి 2021
National - Jan 25, 2021 , 10:43:52

రిప‌బ్లిక్ డే.. స‌రిహ‌ద్దులో భారీ భ‌ద్ర‌త‌

రిప‌బ్లిక్ డే.. స‌రిహ‌ద్దులో భారీ భ‌ద్ర‌త‌

శ్రీన‌గ‌ర్ : గ‌ణంత్ర దినోత్స‌వ వేడుక‌ల నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌లోని స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో పోలీసులు గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అంత‌ర్గ‌త ప్రాంతాల్లో ప్ర‌తి రోజూ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. కొన్ని పోస్టుల వ‌ద్ద పోలీసు బందోబ‌స్తు ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఉగ్ర‌వాదుల చొర‌బాటుకు అవ‌కాశం ఉన్న‌ ప్రాంతాల‌తో పాటు వారు త‌ల దాచుకునే ప్ర‌దేశాల్లో నిఘా ఏర్పాటు చేశామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. 

VIDEOS

logo