సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 20, 2020 , 15:57:50

న‌గ్రోటా ఎన్‌కౌంట‌ర్‌.. భ‌ద్ర‌తా ద‌ళాల‌ను మెచ్చుకున్న మోదీ

న‌గ్రోటా ఎన్‌కౌంట‌ర్‌.. భ‌ద్ర‌తా ద‌ళాల‌ను మెచ్చుకున్న మోదీ

హైద‌రాబాద్‌:  జ‌మ్మూక‌శ్మీర్‌లోని న‌గ్రోటాలో గురువారం భీక‌ర ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ ఎదురుకాల్పుల్లో జైషే ఉగ్ర‌వాదులు న‌లుగురు హ‌తం అయ్యారు.  ఈ ఘ‌ట‌న‌పై ఇవాళ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. ఉన్న‌త స్థాయి స‌మావేశం నిర్వ‌హించారు.  ఆ భేటీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇత‌ర ఇంటెలిజెన్స్ అధికారులు పాల్గొన్నారు.  ముంబై లో 2008లో జ‌రిగిన సెప్టెంబ‌ర్ దాడుల‌కు గుర్తుగా ఉగ్ర‌వాదులు మ‌రో భారీ దాడికి ప‌న్నాగం వేసిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు గుర్తించాయి.  అమిత్ షా, అజిత్ దోవ‌ల్‌, విదేశాంగ కార్య‌ద‌ర్శితో పాటు ఇత‌ర అధికారుల‌తో న‌గ్రోటా ఎదురుకాల్పుల‌పై మోదీ హై లెవ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు.  ముంబై దాడులు జ‌రిగి 12 ఏళ్లు అవుతున్న త‌రుణంలో.. ఉగ్ర‌వాదులు మ‌ళ్లీ అటాక్‌కు ప్లాన్ చేసిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి.  

మ‌న భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌రోసారి అత్యంత సాహాసాన్ని, పోటీత‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాయ‌ని ప్ర‌ధాని అన్నారు. అల‌ర్ట్‌గా ఉన్న సైనిక ద‌ళాల‌కు మోదీ థ్యాంక్స్ చెప్పారు.  జ‌మ్మూక‌శ్మీర్‌లో జ‌రుగుతున్న స్థానిక ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఉగ్ర‌వాదుల‌ను సైనిక ద‌ళాలు నిలువ‌రించిన‌ట్లు ప్ర‌ధాని మోదీ తెలిపారు.  పాకిస్థాన్‌లోని జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన న‌లుగురు ఉగ్ర‌వాదుల‌ను మ‌న‌వాళ్లు మ‌ట్టుబెట్టార‌ని, ఉగ్ర‌వాదుల నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు ప‌దార్ధాల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని, దీంతో భారీ విధ్వంసాన్ని త‌ప్పించార‌ని ఆయ‌న అన్నారు.