మంగళవారం 14 జూలై 2020
National - Jun 25, 2020 , 09:27:05

ఉగ్రవాదుల మద్దతుదారులు ఐదుగురు అరెస్టు

ఉగ్రవాదుల మద్దతుదారులు ఐదుగురు అరెస్టు

కశ్మీర్‌ : జమ్ముకశ్మీర్‌ భద్రతా బలగాల సిబ్బంది బుద్గాం ప్రాంతంలో బుధవారం లష్కరే-ఇ-తోయిబా టెర్రర్‌ మాడ్యూల్‌ను చేధించారు. అదేవిధంగా ఉగ్రవాదుల మద్దతుదారులను ఐదుగురిని అరెస్టు చేశారు. బుద్గాం పోలీస్‌ ఎస్‌ఎస్‌పీ స్పందిస్తూ... విశ్వసనీయ సమాచారం మేరకు బుద్గాం పోలీసులు, ఆర్మీ రాష్ట్రీయ రైఫిల్‌ సిబ్బంది నార్బల్‌ ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులతో సన్నిహితంగా ఉన్న ఐదుగురి వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు. నిందితులను ఇమ్రాన్‌ రషీద్‌, ఇఫ్‌షాన్‌ అహ్మద్‌ ఘనీ, ఓవైస్‌ అహ్మద్‌, మోసిన్‌ క్వాదిర్‌, అబిద్‌ రాథర్‌గా గుర్తించారు. 

నిందితుల వద్ద నుంచి ఏకే-47కు చెందిన 28 లైవ్‌ రౌండ్స్‌ను, ఏకే-47కు చెందిన మ్యాగ్జిన్‌ను, లష్కరే-ఇ-తోయిబాకు చెందిన 20 పోస్టర్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గత కొన్న నెలలుగా ఈ గ్రూపు సభ్యులు యాక్టివ్‌గా ఉంటూ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, మద్దతు తెలుపుతున్నారు. యూఏపీఏ సంబంధిత సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.


logo