సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 07:48:30

ఆగ‌స్టు 15 వ‌ర‌కు 144 సెక్ష‌న్‌

ఆగ‌స్టు 15 వ‌ర‌కు 144 సెక్ష‌న్‌

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులోని డీజే హ‌ళ్లి, కేజీ హ‌ళ్లి పోలీసు స్టేష‌న్ల ప‌రిధిలో ఆగ‌స్టు 15వ తేదీ సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 144 సెక్ష‌న్ అమ‌ల్లో ఉంటుంద‌ని బెంగ‌ళూరు పోలీసు క‌మిష‌న‌ర్ క‌మ‌ల్ పంత్ తెలిపారు. న‌లుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీపీ స్ప‌ష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస‌మూర్తి అల్లుడు న‌వీన్ ఫేస్‌బుక్‌లో ఓ వివాదాస్ప‌ద పోస్టు పెట్ట‌డంతో బెంగ‌ళూరులో హింస చెల‌రేగిన విష‌యం విదిత‌మే.

హింస‌కు పాల్ప‌డిన 146 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళ‌న‌కారుల‌ను అదుపు చేసేందుకు పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. బెంగళూరులో జరిగిన హింసాత్మక ఘటనలు పక్కా పథకం ప్రకారమే జరిగాయని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తిని కూడా చంపాలని కుట్ర పన్నినట్టు తెలుస్తున్నదని మంత్రి అశోక అన్నారు. 


logo