శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 17, 2020 , 08:46:59

నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌ విధింపు

నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌ విధింపు

ముంబయి : మహారాష్ట్ర ప్రభుత్వం నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌ను విధించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం 144 సెక్షన్‌ను విధించింది. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజల రక్షణార్థం జన సమర్థ ప్రదేశాలు, ప్రజా సమావేశాలపై పోలీసులు ఆంక్షలను విధించారు. కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. అదేవిధంగా భారత్‌లో సైతం. నాగపూర్‌లో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆంక్షలను అమలు చేస్తున్నట్లు నాగ్‌పూర్‌ జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ రవీంద్ర కుదం తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ప్రజల్లో భయాన్ని తొలగించే ఉద్దేశంతో, ప్రజా భద్రత, ప్రజారోగ్యం, శాంతి భద్రతల దృష్ట్యా ఆంక్షల అమలు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. దీంతో అన్ని రాజకీయ, సామూహిక, సాంస్కృతిక, మతసంబంధ, క్రీడలు, వ్యాపార ప్రదర్శనలు, క్యాంపులు, పర్యాటకం, సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు వంటి ఇతర కార్యక్రమాలపై ఆంక్షలు కొనసాగుతాయని కుదం పేర్కొన్నారు.


logo