ఆదివారం 29 మార్చి 2020
National - Mar 21, 2020 , 19:47:32

ప్రభుత్వ సూచనలు పాటించకపోతే 144 సెక్షన్‌ విధిస్తాం: కేరళ సీఎం

ప్రభుత్వ సూచనలు పాటించకపోతే 144 సెక్షన్‌ విధిస్తాం: కేరళ సీఎం

తిరువనంతపురం: కేరళలో ఇవాళ కొత్తగా 12 కరోనా కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా కేసులు 52కు చేరడంతో సీఎం ప్రజలకు పలు సూచనలు చేశారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఒకచోట చేరకూడదని తెలిపారు. శుభకార్యాలు, వేడుకలు ఉంటే వాయిదా వేసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే.. వైరస్‌ దరిచేరదని ఆయన తెలిపారు. 

దగ్గు, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా, తక్షణమే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రధాన సూచన.. జనం సమూహాలుగా ఏర్పడకూడదు. ఈ సూచన పాటించని యెడల కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందనీ, 144 సెక్షన్‌ సైతం విధించేందుకు కూడా వెనుకాడబోమని సీఎం పినరయి విజయన్‌ హెచ్చరికలు జారీ చేశారు. 


logo