గురువారం 02 జూలై 2020
National - Jul 01, 2020 , 14:14:36

ముంబైలో 144 సెక్షన్‌ అమలు

ముంబైలో 144 సెక్షన్‌ అమలు

ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలో మళ్లీ 144 సెక్షన్‌ విధించారు. బుధవారం నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు ముంబై పోలీస్‌ కమిషనర్‌ ప్రణయ అశోక్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో బహిరంగ, మతపరమైన ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమిగూడి ఉండకూడదని చెప్పారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.  

దేశంలో కరోనా కేసుల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.7 లక్షల మంది కరోనా బారినపడగా 7,610 మంది మరణించారు. మహారాష్ట్రలో 1,015 మంది పోలీసులకు కరోనా సోకింది. వారిలో 60 మంది చనిపోయారు. logo