గురువారం 22 అక్టోబర్ 2020
National - Oct 01, 2020 , 12:31:28

హ‌త్రాస్‌కు రాహుల్‌, ప్రియాంక‌.. అమ‌ల్లో 144 సెక్ష‌న్

హ‌త్రాస్‌కు రాహుల్‌, ప్రియాంక‌.. అమ‌ల్లో 144 సెక్ష‌న్

ల‌క్నో : యూపీలో వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అట‌విక పాల‌న కొన‌సాగుతోంద‌ని మండిప‌డ్డారు. హ‌త్రాస్ అత్యాచార బాధితురాలు చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మ‌ర‌ణించిన విష‌యం విదిత‌మే. మృతురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇవాళ హ‌త్రాస్‌కు వెళ్ల‌నున్నారు. ఈ క్ర‌మంలో హ‌త్రాస్‌లో 144 సెక్ష‌న్ విధించారు. మీడియాను కూడా గ్రామంలోకి అనుమ‌తించ‌డం లేదు. గుంపులు గుంపులుగా గుమిగూడితే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పోలీసులు హెచ్చ‌రించారు. రాహుల్‌, ప్రియాంక ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు హత్రాస్‌కు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. ఇక హ‌త్రాస్‌లో ముగ్గురు పోలీసుల‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. ఈ క్ర‌మంలో ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. 


logo