గురువారం 09 ఏప్రిల్ 2020
National - Mar 12, 2020 , 01:55:15

తీపి.. మహా ప్రీతి!

తీపి.. మహా ప్రీతి!
  • చక్కెర లేకుండా ఉండలేమంటున్న భారతీయులు
  • తక్కువ క్యాలరీల షుగర్‌ తీసుకోవాలని నిపుణుల సూచన

ముంబై: అది పండుగైనా.. పుట్టినరోజైనా.. పెండ్లయినా పేరంటమైనా భారతీయ వేడుకల్లో తీపి పదార్థాలు ఉండాల్సిందే. మన రోజువారీ జీవనంలో చక్కెర అనేది అతిముఖ్యమైన భాగం.  తీపి.. మనవాళ్లకు మహా ప్రీతి. ఈ నేపథ్యంలో చక్కెర వినియోగంపై ఇటీవల ముంబైలోని ఒక మాల్‌లో నిర్వహించిన  సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ‘తీపి’ లేకపోతే జీవితం చేదుమయం అవుతుందని దాదాపు 60 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. షుగర్‌తో వచ్చే క్యాలరీలు, కలిగే దుష్ప్రభావాల గురించి దాదాపు 75 శాతం మందికి అవగాహన ఉండడం. చక్కెర నుంచి ఎక్కువ క్యాలరీలు పొందడం వల్ల తలెత్తే పరిణామాల గురించి తెలిసినప్పటికీ, భారతీయులు షుగర్‌కు దూరంగా ఉండలేకపోతున్నారని సర్వే పేర్కొంది. అందుకే రెగ్యులర్‌ షుగర్‌ నుంచి ఆరోగ్యకర షుగర్‌వైపు మళ్లడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల తీపిపై మక్కువ తీరడంతోపాటు క్యాలరీలు కూడా తగ్గుతాయని చెప్తున్నారు. 


మఖానాస్‌తో డయాబెటిస్‌కు చెక్‌

డయాబెటిస్‌తో బాధపడేవారికి మఖానాస్‌ లేదా ఫాక్స్‌ నట్స్‌ (తామరగింజలు) ఎంతో ఉపయోగకరమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చక్కెర స్థాయిలను ఇవి నియంత్రిస్తాయి. మెగ్నీషియం ఉండడం, సోడియం తక్కువగా ఉండడం వల్ల డయాబెటిస్‌తో బాధపడేవారు దీన్ని స్నాక్‌గా తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 


logo