గురువారం 28 మే 2020
National - May 14, 2020 , 09:54:03

సెక్ర‌ట‌రీకి పాజిటివ్..కూర‌గాయ‌ల మార్కెట్ క్లోజ్‌

సెక్ర‌ట‌రీకి పాజిటివ్..కూర‌గాయ‌ల మార్కెట్ క్లోజ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని గాజిపూర్ పండ్ల‌, కూర‌గాయల మార్కెట్ లో సెక్ర‌ట‌రీ, డిప్యూటీ సెక్ర‌ట‌రీకి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయింది. ఇద్ద‌రికీ పాజిటివ్ గా రావ‌డంతో మార్కెట్ ను రెండు రోజుల పాటు మూసివేసిన‌ట్లు మార్కెట్ ఛైర్మ‌న్ ఎస్పీ గుప్తా తెలిపారు.

ఇద్ద‌రితో స‌న్నిహితంగా ఉన్న వారి వివ‌రాలు సేక‌రించి..అంద‌రినీ క్వారంటైన్ లో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు చెప్పారు. ఢిల్లీలో కేంద్రం ఆదేశాల మేర‌కు మూడో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌గా..కంటైన్ మెంట్ జోన్లు మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది ప్ర‌భుత్వం. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo