బుధవారం 03 జూన్ 2020
National - May 14, 2020 , 15:04:48

ఎల్లుండి నుంచి రెండో విడత వందే భారత్‌

ఎల్లుండి నుంచి రెండో విడత వందే భారత్‌

న్యూఢిల్లీ: రెండో విడత వందే భారత్‌ మిషన్‌ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ ప్రకటించారు. సుమారు 31 దేశాల్లో ఉండిపోయిన భారతీయులను 149 విమానాల్లో స్వదేశానికి తీసుకువస్తామని చెప్పారు. తెలంగాణ, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌తో సహా 16 రాష్ర్టాల నుంచి దక్షిణాసియా, ఆగ్నేయాసియా, గల్ఫ్‌ దేశాలు, యురేషియా, ఉత్తర అమెరికాల్లోని 31 దేశాలకు వలసవెల్లిన వారిని రెండో విడతలో తరలిస్తామని ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియ మే 22 వరకు కొనసాగుతుందని తెలిపారు.  

విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ను మే 7న చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం మొదటి విడత వందే భారత్‌ మిషన్‌ కొనసాగుతున్నది. 

రెండో విడత వందే భారత్‌లో పశ్చిమ బెంగాల్‌కు ఎలాంటి విమానాలను నడపడం లేదన్నారు. వచ్చే వారం కోల్‌కతా నుంచి దేశీయ విమానాలను ప్రారంభిస్తామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.


logo