మంగళవారం 19 జనవరి 2021
National - Jan 08, 2021 , 07:43:15

నేడు రెండో విడుత కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌

నేడు రెండో విడుత కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రోండో విడుత కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. వ్యాక్సిన్‌ పంపిణీలో తలెత్తే లోటుపాట్లు గుర్తిచేందుకు డ్రైరన్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 736 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగనుంది. ఇప్పటికే కోల్డ్‌ చైన్‌ విధానాన్ని మరింత పటిష్టం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ కోసం మానవ వనరులు సిద్ధం చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తొలి డ్రైరన్‌లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకోవాలని, వ్యాక్సిన్‌పై ప్రజల్లో అపోహలను తొలగించాలని పిలుపునిచ్చింది. 

దేశవ్యాప్త కరోనా డ్రైరన్‌లో భాగంగా రాష్ట్రంలో 12 వందల కేంద్రాల్లో డమ్మీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఒక్కొ కేంద్రంలో 25 మందికి నమూనా ప్రక్రియ నిర్వహించనున్నారు. దీనిద్వారా కొవిన్‌ యాప్‌లో లోపాలను పరిశీలించడంతోపాటు, వ్యాక్సిన్‌ పంపిణీలో సమస్యలపై దృష్టిసారించనున్నారు. వాటిని గుర్తించి పరిష్కరించనున్నారు. డమ్మీ వ్యాక్సినేషన్‌ కోసం ఇప్పటికే అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేశారు.