గురువారం 03 డిసెంబర్ 2020
National - Aug 29, 2020 , 10:55:06

ఒడిశాలో రెండోదశ కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌

ఒడిశాలో రెండోదశ కోవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌

భువనేశ్వర్: భారతదేశపు స్వదేశీ కొవిడ్-19 వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ హ్యూమన్‌ క్లినికల్ ట్రయల్స్‌ మొదటి విడతలో సక్సెస్‌ కావడంతో రెండో విడత క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం సిద్ధమవుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు సంబంధించి మానవ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 12 సైట్లలో ఒడిశాలోని ఎస్‌యూఎం ఆస్పత్రి ఒకటి. మొదటి విడతలో ఒడిషా ఫెసిలిటీలో ఐదుగురు సహా 375 మంది వలంటీర్లు పాల్గొన్నారు. టీకా తీసుకున్న వలంటీర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేని దవాఖానకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

వ్యాక్సిన్‌ ఎంత సమర్థవంతంగా పని చేస్తుందో? ఏ స్థాయిలో ప్రతిరక్షకాలు అభివృద్ధి చెందుతున్నాయో తెలుసుకునేందుకు వలంటీర్ల రక్త నమూనాలు సేకరిస్తున్నామని ఎస్‌ఎంయూ హాస్పిటల్‌ ట్రయల్స్‌ ప్రధాన పరిశోధకుడు డాక్టర్‌ వెంకట్రావ్‌ తెలిపారు. ‘దేశీయ వ్యాక్సిన్‌ రెండో దశ ట్రయల్స్‌ ప్రక్రియ ప్రారంభించాం. వారం తర్వాత ప్రారంభం అవుతుంది’ అని తెలిపారు. రెండో దశ క్లినికల్ ట్రయల్ కోసం స్వచ్ఛందంగా పలువురు ముందుకు వచ్చిన దవాఖాన అధికారులను ఆశ్రయించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్ షాట్ల కోసం ఎంచుకునేందుకు ముందు క్షుణ్ణంగా స్క్రీనింగ్‌ చేస్తారు.

రెండో దశలో ఆరోగ్యవంతమైన వ్యక్తులకు మాత్రమే వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. సరిగ్గా నెల క్రితం వ్యాక్సిన్ వేసిన అభ్యర్థుల వివరాలను ఆసుపత్రి ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, ఇద్దరు అభ్యర్థులు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఎలాంటి ప్రతికూల ప్రభావాలు లేవని, ఎలాంటి అవస్థతకు గురికాలేదని తెలిపారు. ‘వ్యాక్సిన్ అందుకున్న తరువాత మేం ఎదుర్కొనే ఆరోగ్య సంక్లిష్టతలను జాబితా చేయడం కోసం డైరీని మెయింటైన్ చేయాలని వైద్యులు కోరారని, తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్, డయేరియా వంటి సమస్యలు ఎదురకాలేదని పేర్కొన్నారు. వైద్యులు ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. నా రక్త నమూనాలు ఐదుసార్లు సేకరించారు’ అని ఓ వలంటీర్‌ చెప్పాడు.

కాగా, రెండో దశ ట్రయల్స్‌ అనంతరం మూడో దశ ట్రయల్స్‌ విజయవంతమైతే ఈ ఏడాది చివరి నాటికి, లేదంటే వచ్చే ఏడాది ప్రారంభానికి కొవాగ్జిన్‌ టీకా సిద్ధం అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ వ్యాక్సిన్ చర్మ ట్రయల్స్‌కు ఆమోదం తెలిపింది. మొదటి దశ ట్రయల్ సమయంలో ఇది నేరుగా కండరంలోనికి ఇంజెక్ట్ చేస్తారు. ఇన్ట్రామస్కులర్ రూట్‌తో పాటుగా, కోవాగ్జిన్‌ ఇప్పుడు ఇంట్రేటర్మల్ రూట్ ద్వారా నిర్వహించబడుతోంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.