మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 17, 2020 , 13:37:31

బోళాశంక‌రుడికి రైలులో ఒక సీటు

బోళాశంక‌రుడికి రైలులో ఒక సీటు

హైద‌రాబాద్‌:  వార‌ణాసి నుంచి ఇండోర్ మ‌ధ్య న‌డిచే కాశీమ‌హాకాల్ ఎక్స్‌ప్రెస్ అనే కొత్త రైలును ప్ర‌ధాని మోదీ ఆదివారం ప్రారంభించారు.  అయితే ఆ రైలులోని బీ5 ఏసీ కోచ్‌లో 64వ బెర్త్‌ను ప‌ర‌మేశ్వ‌రుడికి కేటాయించారు. ఆ సీటులో శివుడికి పూజ‌లు చేసి రైలును స్టార్ట్ చేశారు.  కాశీలోని విశ్వ‌నాథ్‌, ఉజ్జ‌యినిలోని మ‌హాకాళేశ్వ‌ర్‌, ఇండోర్‌లోని ఓంకారేశ్వ‌ర్ జ్యోతిర్లింగాల‌ను ట‌చ్ చేస్తూ ఆ రైలు వెళ్తుంది.  బోళాశంక‌రుడి కోసం కేటాయించిన ఆ సీటును ప‌ర్మ‌నెంట్‌గా ఉంచాలా లేదా అన్న దానిపై ఇంకా అధికారులు నిర్ణ‌యం తీసుకోలేదు. రైలులో దేవుడి కోసం ఓ సీటును కేటాయించి, ఆ సీటును ఖాళీగా వ‌దిలేయడం ఇదే మొద‌టిసారి. శివుడి కోసం కేటాయించిన సీటును అందంగా తీర్చిదిద్దారు. మ‌హాకాళేశ్వ‌రుడి ఆల‌యం బొమ్మ‌ను వేశారు.  రైలులో ఆధ్మాత్మిక మ్యూజిక్‌ను ప్లే చేస్తారు.  కేవ‌లం వెజిటేరియ‌న్ మీల్స్‌ను స‌ర్వ్ చేయ‌నున్నారు. మొత్తం థార్డ్ ఏసీ కోచ్‌ల‌తో ఉండే ఈ రైలు వారానికి మూడు సార్లు న‌డుస్తుంది.  logo