బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 06:56:41

ఢిల్లీలో తొలిసారి వెయ్యి కంటే తక్కువ కేసులు

ఢిల్లీలో తొలిసారి వెయ్యి కంటే తక్కువ కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత ఏడువారాల్లో తొలిసారి వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. నగరంలో వైరస్‌ వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరుకుని తిరిగి తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నదని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు. దేశంలో సామూహిక వ్యాప్తి లేదని స్థానిక వ్యాప్తే ఉన్నదని తెలిపారు. కాగా, ఢిల్లీలో కేజ్రీవాల్‌ మోడల్‌ విజయవంతమైందని ఆప్‌ సర్కార్‌ పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వ చర్యల వల్లే పరిస్థితి అదుపులోకి వచ్చిందని బీజేపీ వ్యాఖ్యానించింది. 


logo