శనివారం 31 అక్టోబర్ 2020
National - Aug 11, 2020 , 13:20:35

భ‌య్యా కొంచెం పెట్టు భ‌య్యా.. ఆహారం కోసం అభ్య‌ర్థించిన‌ జంతువు!

భ‌య్యా కొంచెం పెట్టు భ‌య్యా.. ఆహారం కోసం అభ్య‌ర్థించిన‌ జంతువు!

ఆక‌లేస్తే అడ‌గ‌డానికి ఒక మ‌నిషికి త‌ప్ప మ‌రేవేటికి ఆ అవ‌కాశం లేదు. జంతువులు అయితే ఆక‌లికి అరుస్తాయి కాని, పెట్ట‌మ‌ని అడ‌గ‌వు. కానీ ఈ స‌ముద్ర‌పు జంతువు మాత్రం మ‌నిషి అడిగిన‌ట్లుగానే అడిగి నెటిజ‌న్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఒక వ్య‌క్తి బ‌కెట్ తీసుకొని అందులో ఉన్న ఆహారాన్ని స‌ముద్ర‌పు జంతువుల‌కు పంపిణీ చేస్తున్నాడు.

15 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ సుశాంత నందా ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు. అత‌ను ముందుగా నిల్చొని ఆహారం వేస్తుంటే వెనుక వైపు నుంచి మ‌రో జంతువు వ‌చ్చి భ‌య్యా కొంచెం పెట్ట‌వా అంటూ చేతితో అత‌ని కాళ్ల‌ను గోకుతున్న‌ది. 'హ‌లో సార్ నేను కూడా ఇక్క‌డ ఉన్నాను. ఆహారాన్ని అడుగుతున్న‌ప్పుడు జంతువుల ముఖంలో ఎక్స్‌ప్రెష‌న్లు చూడాలి' అనే శీర్షిక‌ను జోడించారు. ఇప్ప‌టివర‌కు ఈ వీడియోను 14 వేల‌మందికి పైగా వీక్షించారు.