సోమవారం 01 జూన్ 2020
National - May 09, 2020 , 14:07:18

క‌బ‌డ్డీ తో రెండు గ్రూప్ ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

క‌బ‌డ్డీ తో రెండు గ్రూప్ ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

మొర‌దాబాద్ : క‌బ‌డ్డీ ఆట రెండు గ్రూపుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. మొర‌దాబాద్ లో కొంత‌మంది పిల్ల‌లు క‌బ‌డ్డీ ఆట విష‌యంలో గొడ‌వ ప‌డ్డారు. ఈ విష‌యం కాస్తా వారి త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌ర‌కు చేర‌డంతో..పిల్ల‌ల కుటుంబ‌స‌భ్యులు కూడా ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఈ ఘ‌ట‌నంతా అక్క‌డున్న సీసీ టీవీ పుటేజీలో రికార్డైంది.

మ‌జ్ హోలా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని కాశీరాం కాల‌నీలో ఈ గొడ‌వ జ‌రిగింది. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని అద‌న‌పు ఎస్పీ దీప‌క్ భూకేర్ తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు.


logo