సోమవారం 25 మే 2020
National - Apr 06, 2020 , 01:51:28

కరోనా గాలిద్వారా వ్యాపించదు!

కరోనా గాలిద్వారా వ్యాపించదు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ గాలి ద్వారా సోకుతుందని వదంతులు వ్యాపిస్తున్నాయి. ప్రజలను భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) స్పందించింది. కరోనా వైరస్‌ గాలి ద్వారా వ్యాపించదని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రమణ్‌ ఆర్‌ గంగాఖేడ్కర్‌ ఆదివారం స్పష్టంచేశారు. తుంపర్లు, ప్రత్యక్ష తాకిడి వల్ల మాత్రమే వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ఒకవేళ గాలి ద్వారా సోకడం నిజమైతే, కరోనా రోగుల కుటుంబసభ్యులందరికీ కొవిడ్‌-19 సోకేదన్నారు. దవాఖానల్లో ఉన్న రోగులకు కూడా ఇదే సిద్దాంతం వర్తిస్తుందన్నారు. కరోనా గాలి ద్వారా వ్యాపిస్తుందనడానికి తమ దగ్గర ఇప్పటివరకైతే ఎలాంటి ఆధారాలు లేవని గంగాఖేడ్కర్‌ చెప్పారు. 


logo