శనివారం 04 జూలై 2020
National - Jun 16, 2020 , 12:23:25

కొవిడ్‌ టీకా కోసం భారత శాస్త్రవేత్తల కృషి: నితిన్‌ గడ్కరీ

కొవిడ్‌ టీకా కోసం భారత శాస్త్రవేత్తల కృషి: నితిన్‌ గడ్కరీ

న్యూ ఢిల్లీ: కొవిడ్‌-19ను ఎదుర్కొనే టీకా కోసం భారత శాస్త్రవేత్తలు, సంస్థలు విశేష కృషిచేస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు. ‘టీకా తయారీ కోసం అమెరికాలో విస్తృత ప్రయోగాలు విజవంతంగా జరుగుతున్నాయని విన్నా. మన దేశంలో కూడా శాస్త్రవేత్తలు పరిశోధనల్లో నిమగ్నమయ్యారు. టీకా కోసం వేచి చూస్తున్నాం.’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు. కొవిడ్‌ అనంతరం ఎంఎస్‌ఎంఈ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశంలో గడ్కరీ మాట్లాడారు. ‘ప్రస్తుతం మనం ఆర్థిక యుద్ధాన్ని ఎదుర్కొంటున్నాం.. మనదేకాదు ప్రపంచం పరిస్థితి కూడా ఇదే. ఇపుప్డు మొత్తం  ప్రపంచం చైనా గురించే ఆలోచిస్తున్నది. ప్రతి ఒక్కరూ కొత్త అవకాశం కోసం చూస్తున్నారు.’ అని మంత్రి పేర్కొన్నారు. 

  ఇండియా పెట్టుబడిదారుల కోసం అనుకూలమైన మార్గాన్ని ఏర్పరుస్తుందని తాను భావిస్తున్నానని గడ్కరీ పేర్కొన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)  పెంపునకు ప్రధాని మోడీ నాయకత్వంలోని కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు. ఎంఎస్‌పీని తగ్గించాలని తాను కోరినట్లు వస్తున్న వార్తలో నిజం లేదని మంత్రి స్పష్టం చేశారు. తప్పుడు వార్తలను రైతులు నమ్మవద్దని కోరారు. అన్నదాతలను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆదుకుంటుందని, ఇది భవిష్యత్తులో కూడా పునరావృతమవుతుందని ఆయన స్పష్టం చేశారు.logo