సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 14, 2020 , 19:29:41

కరోనాను నియంత్రించే యాంటీబాడీలోని కీలక జన్యువు గుర్తింపు

కరోనాను నియంత్రించే యాంటీబాడీలోని కీలక జన్యువు గుర్తింపు

వాషింగ్టన్: కరోనా వైరస్‌ను నియంత్రించే యాంటీబాడీలోని కీలక జన్యువును అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో తమ అధ్యయనం సహాయపడుతుందని వారు పేర్కొన్నారు. అమెరికాలోని స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల గుర్తించిన సుమారు 300 మానవ సార్స్-కోవి-2 ప్రతిరోధకాలను విశ్లేషించారు.

కరోనా వైరస్‌ను నియంత్రించడంలో సంబంధమున్న అత్యంత ప్రభావవంతమైన ఐజీహెచ్‌వీ కుటుంబానికి చెందిన ఐజీహెచ్‌వీ3-53 జన్యువును త్రిడీ నమూనా ద్వారా వారు కనుగొన్నారు. వైరస్‌లోని ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకునే ఆర్బీడీ లక్ష్య ప్రతిరోధకాల్లో ఈ జన్యువు ఉంటుందని గుర్తించారు. ప్రతిరోధకాల్లోని ఈ ఐజీహెచ్‌వీ3-53 జన్యువు తక్కువ మార్పు చెందే కరోనా వైరస్‌ను ప్రభావవంతంగా నిర్మూలిస్తుందని పేర్కొన్నారు. తమ అధ్యయన వివరాలను జర్నల్ సైన్స్‌లో ప్రచురించారు.logo