శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 08:19:16

నేటి నుంచి పలు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభం

నేటి నుంచి పలు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభం

న్యూఢిల్లీ : నేటి నుంచి పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆరునెలల పాటు మూతపడిన పాఠశాలలు తిరిగి కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌లో భాగంగా 21 నుంచి పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్‌ సంస్థలను పాక్షికంగా తిరిగి మార్గదర్శకాలను పాటిస్తూ తెరిచేందుకు అనుమతిచ్చింది. ఎస్‌ఓపీల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు సోమవారం నుంచి స్కూళ్లకు వెళ్లవచ్చని.. కొవిడ్‌ మార్గదర్శకాలను పాటించాల్సిన అవసరాన్ని నెక్కి చెప్పింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులు కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని సూచించింది. ఫేస్‌ మాస్క్‌ ధరించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం తదితర నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.

కంటైన్‌మెంట్‌ జోన్లలో పాఠశాలలు మూసే ఉండనున్నాయి. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాఠశాలలకు వచ్చేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్, అస్సాం, హర్యాన, జమ్మూ కాశ్మీర్‌, కర్నాటక, పంజాబ్‌ సహా పలు ఇతర రాష్ట్రాలు, యూటీలు నేటి నుంచి పాక్షికంగా పాఠశాలలు పునరుద్ధరించాలని నిర్ణయించాయి. సోమవారం నుండి తరగతులు తిరిగి ప్రారంభించడానికి అనుమతించబోమని ఢిల్లీ, గుజరాత్‌, కేరళ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పశ్చిమబెంగాల్‌ ప్రకటించాయి. రాష్ట్రంలో పాఠశాల తిరిగి తెరవడంపై నిర్ణయం తీసుకోవడానికి బీహార్ విద్యా విభాగం మంగళవారం సమావేశం నిర్వహించనుంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo