ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 11, 2020 , 08:53:52

ఈ నెల 21 నుంచి అక్కడ పాఠశాలలు ప్రారంభం

ఈ నెల 21 నుంచి అక్కడ పాఠశాలలు ప్రారంభం

పనాజీ : ఈ నెల 21 నుంచి పది, 12వ తరగతులను రాష్ట్రంలో పాక్షికంగా తిరిగి ప్రారంభించేందుకు గోవా ప్రభుత్వం ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలను (ఎస్‌ఓపీ) జారీ చేసింది. ఈ మేరకు ఒక తరగతిలో 12 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉండరాదని, అలాగే సరి-బేసి విధానాన్ని అవలంభించాలని ఆదేశించింది. క్లాస్‌ రూంలో కనీసం ఆరు అడుగుల సామాజిక దూరం నిబంధనలు పాటించాలని ఆదేశించింది. వర్క్‌షాప్‌లు, ప్రయోగశాలల్లో శిక్షణ కోసం పరికరాలను వినియోగించే ముందు.. తర్వాత చేతులను విధిగా శుభ్రం చేసుకోవాలని చెప్పింది. ఫేస్‌మాస్క్‌లు, వైజర్‌, హ్యాండ్‌ శానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. తప్పనిసరిగా ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానాలను పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, గత నెలలో హోంమంత్రిత్వశాఖ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు 15 తర్వాత పాఠశాలలు, కోచింగ్‌ సంస్థలను తిరిగి ప్రారంభించేందుకు అనుమతించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.