సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 20:43:36

అక్టోబర్‌ ఒకటి నుంచి 10-12 తరగతులు.. ఎక్కడంటే..

అక్టోబర్‌ ఒకటి నుంచి 10-12 తరగతులు.. ఎక్కడంటే..

చెన్నై : సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అక్టోబర్  ఒకటో తేదీ నుంచి 10 నుంచి 12 తరగతుల విద్యార్థులను స్వచ్ఛంద ప్రాతిపదికన పాఠశాలలకు తిరిగి వచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తిస్తుందని, కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులను పాఠశాలలకు అనుమతించమని స్పంష్టం చేసింది. పాఠశాలల్లోని విద్యార్థులను రెండు బ్యాచ్‌లు విభజించి, మొదటి బ్యాచ్ సోమ, బుధ, శుక్రవారాల్లో, రెండో బ్యాచ్‌లో మంగళ, గురు, శనివారాల్లో తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఉపాధ్యాయులను సైతం సగం మందిని అనుమతించాలని చెప్పింది. కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌ నాటి నుంచి పాఠశాలలు మూసే ఉన్నాయి. ఈ నెల ప్రారంభంలో ఆరోగ్య మంత్రిత్వశాఖ పలు నిబంధనలతో పాఠశాలలను పాక్షికంగా తిరిగి తెరవడానికి మార్గదర్శకాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు, సంరక్షకుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌, డిస్టెన్స్‌ లర్నింగ్‌ కొనసాగుతుందని చెప్పింది. తరగతి గదుల్లో సీట్లు ఒక్కోదారికి ఆరు అడుగుల భౌతిక దూరం ఉండాలని, మాస్క్‌లు ధరించడం తదితర నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo