బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 08, 2020 , 11:43:04

ఈనెల 23న తెరుచుకోనున్న పాఠ‌శాల‌లు

ఈనెల 23న తెరుచుకోనున్న పాఠ‌శాల‌లు

ముంబై: మ‌హారాష్ట్రలో ఈ నెల 23 నుంచి పాఠ‌శాల‌లు పునఃప్రారంభంకా‌నున్నాయి. దీపావ‌ళి త‌ర్వాత తొమ్మిది నుంచి 12వ త‌ర‌గ‌తి వ‌ర‌కు స్కూళ్లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వ‌ర్షా గైక్వాడ్ ప్ర‌క‌టించారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ పాఠ‌శాల‌‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే నిర్వ‌హించిన‌ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతూ ఈమేర‌కు ప్ర‌క‌ట‌న చేశారు. న‌వంబ‌ర్ 17 నుంచి 22 మధ్య రాష్ట్రంలోని ఉపాధ్యాయుల‌కు ఆర్టీ పీసీఆర్ ప‌రీక్షలు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. పాఠ‌శాల‌ల‌ను ఈనెల 23న తెరుస్తామ‌ని, విద్యార్థుల‌కు థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ చేసిన త‌ర్వాతే లోప‌లికి అనుమ‌తిస్తామ‌న్నారు. ఒక్కో బెంచికి ఒక్క విద్యార్థిని మాత్ర‌మే కూర్చోనిస్తామ‌ని తెలిపారు. త‌ర‌గ‌తుల‌ను రోజు విడిచి రోజు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఇత‌ర స‌బ్జెక్టుల‌కంటే మ్యాథ్స్‌, సైన్స్‌, ఇంగ్లిష్ స‌బ్జెక్టుల‌ను ఆన్‌లైన్‌లో బోధించ‌డం క‌ష్ట‌మ‌ని వెల్ల‌డించారు.  ‌

కాగా, ప్ర‌స్తుతం ప్రపంచంలో ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే దేశంలో రెండో ద‌శ క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిచే అవ‌కాశం ఉద‌ని సీఎం ఉద్ధ‌వ్‌ ఠాక్రే అన్నారు. దీపావ‌ళి త‌ర్వాత మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. పాఠ‌శాల‌ల్లో న‌డుస్తున్న క్వారంటైన్ సెంట‌ర్ల‌ను ఇప్ప‌ట్లో మూసేవేయ‌మ‌న్నారు. త‌ర‌గ‌తి గ‌దుల‌ను ఎక్కడ నిర్వ‌హించాల‌నే విష‌యంలో స్థానిక అధికారులే నిర్ణ‌యం తీసుకుంటార‌ని వెల్ల‌డించారు. పాఠ‌శాల‌ల్లో శానిటైజేష‌న్, ఉపాధ్య‌యుల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌ఙంచ‌డం వంటి జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల‌ని ఆదేశించారు.