శనివారం 23 జనవరి 2021
National - Jan 01, 2021 , 16:16:25

తెరుచుకున్న స్కూళ్లు.. హాజరుకాని స్టూడెంట్స్‌

తెరుచుకున్న స్కూళ్లు.. హాజరుకాని స్టూడెంట్స్‌

గౌహతి: అసోంలో శుక్రవారం నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లను ప్రారంభించారు. ఎలిమెంటరీ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు అన్ని విద్యాసంస్థలను పునరుద్ధరించారు. అయితే న్యూఇయర్‌ వేడుకల వల్లనో లేక కరోనా భయంతోనో విద్యార్థులు లేక పలు స్కూళ్లు బోసిపోయాయి. దీంతో స్కూళ్లకు వచ్చిన ఉపాధ్యాయులు చేసేదేమీ లేక కాలక్షేపంతో రోజంతా గడిపారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి నుంచి మూసివేసిన స్కూళ్లను అసోంలో శుక్రవారం నుంచి తెరిచారు. అయితే తొలి రోజు ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాలేదని డిస్‌పూర్‌లోని ప్రభుత్వ స్కూల్‌ ప్రిన్సిపాల్ ఇన్‌చార్జ్‌ తెలిపారు. దీంతో టీచర్లంతా ఆట పాటలతో రోజంతా గడిపారని ఆమె చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి


logo