అక్కడ డిసెంబర్ చివరి దాకా బడులు లేనట్టే!

ఐజ్వాల్: కరోనా వైరస్ సంక్రమణ నేపథ్యంలో మరింత వ్యాప్తి చెందకుండా మిజోరాంలోని అన్ని పాఠశాలలు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి మూసివేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఓ అధికారి తెలిపారు. శీతాకాలంలో వైరస్ తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున కిండర్ గార్టెన్ నుంచి 12 వరకు అన్ని తరగతులు బంద్ చేసినట్లు విద్యాశాఖ మంత్రి లాల్చందమ రాల్టే పేర్కొన్నారు. కరోనా పేర్రేపిత లాక్ నుంచి విద్యాసంస్థలు మూసే ఉన్నాయి. అక్టోబర్ 16న 10-12 తరగతులు ప్రారంభమయ్యాయి. అనేక మంది విద్యార్థులు మహమ్మారి బారినపడగా తరగతులను సస్పెండ్ చేశారు.
వచ్చే ఏడాది జనవరి 15న పాఠశాలల పునః ప్రారంభించాలని తాత్కాలికంగా షెడ్యూల్ ఖరారు చేశామని, రాష్ట్ర కార్యనిర్వహణ కమిటీ తుది నిర్ణయం ప్రకటిస్తుందని రాల్టే చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ విద్యా సంవత్సరం కోసం విద్యాశాఖ ఇప్పటికే 30శాతం సిలబస్‌ను తగ్గించేందుకు అంగీకరించింది. మిజోరాం బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (ఎంబీఎస్ఈ)కు 10-12 తరగతుల విద్యార్థులకు మోడల్ ప్రశ్నలను సిద్ధం చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సులు సైతం సిద్ధం చేస్తామని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ‘కొవిడ్-19 నో టాలరెన్స్ డ్రైవ్’ను నిర్వహిస్తోంది. నోబెవర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు పొడగించనున్నట్లు ప్రభుత్వ తెలిపింది.
తాజావార్తలు
- 'కుట్రతోనే రైతు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ జాప్యం'
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన శార్దూల్, సుందర్
- వాట్సాప్ కొత్త స్టేటస్ చూశారా?
- ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్
- బ్రిస్బేన్ టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ అరుదైన ఘనత
- కర్నాటకలో అభివృద్ధి పనులను ప్రారంభించనున్న అమిత్‌షా
- డెంటల్ సీట్ల భర్తీకి అదనపు కౌన్సెలింగ్
- పొగమంచు ఎఫెక్ట్.. 26 రైళ్లు ఆలస్యం..
- రాష్ట్రంలో కొత్తగా 299 కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 15,144 కరోనా పాజిటివ్ కేసులు