బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 02:29:32

వైరస్‌ అదుపులోకి వచ్చాకే స్కూళ్లు

వైరస్‌ అదుపులోకి వచ్చాకే స్కూళ్లు

  • 30 శాతం మంది విద్యార్థులతో స్కూల్స్‌ తెరువచ్చు
  • 50 రోజుల్లో సీబీఎస్‌ఈ మూల్యాంకనం: పోఖ్రియాల్‌

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాకే పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన అనంతరం పాఠశాలల్ని తిరిగి తెరిచేటప్పుడు పాటించాల్సిన నిబంధనల గురించి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలల్లోని టీచర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పలు సూచనలు చేశారు. సీబీఎస్‌ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో పాల్గొనే టీచర్లు ఆన్‌లైన్‌ తరగతుల్ని తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

  • వీడియో కాన్ఫరెన్స్‌లో పోఖ్రియాల్‌ వెల్లడించిన విషయాలు, సూచనలు:
  • 30 శాతం మంది విద్యార్థులతో ప్రాథమికంగా పాఠశాలలు ప్రారంభించాలని ఎన్సీఈఆర్టీ సూచించింది.
  • భౌతికదూరం నిబంధనను పాటించేలా తరగతిలో విద్యార్థులు కూర్చునే వరుస క్రమాలు, సీటింగ్‌లో మార్పులు
  • విద్యార్థులను బ్యాచుల వారీగా విభజించి వేర్వేరు సమయాల్లో పాఠాలు బోధించాలి.
  • టీచర్లు, విద్యార్థులు విధిగా ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను వాడాలి.
  • లాక్‌డౌన్‌ కాలంలో టీచర్లు ఆన్‌లైన్‌లో విద్యార్థులకు పాఠాలు చెప్పడాన్ని కొనసాగించాలి.
  • సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షా పేపర్ల మూల్యాంకనం 50 రోజుల్లో పూర్తి అయ్యే అవకాశమున్నది.
  • యూజీసీ-నెట్‌ పరీక్షా తేదీని త్వరలోనే ప్రకటిస్తాం.


logo