శుక్రవారం 22 జనవరి 2021
National - Nov 25, 2020 , 16:27:00

కరోనా ఎఫెక్ట్ : ఆ రాష్ట్రంలో విద్యార్థులు లేక మూతపడుతున్న పాఠశాలలు...

కరోనా ఎఫెక్ట్ : ఆ రాష్ట్రంలో విద్యార్థులు లేక మూతపడుతున్న పాఠశాలలు...

గాంధీనగర్ : దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను ఓపెన్ చేస్తున్నారు. అన్ లాక్  తర్వాత కరోనా కేసులు నమోదవుతున్నా..నెమ్మదిగా  లోపాలను అధిగమిస్తూ స్కూళ్లను తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో విజృంభిస్తుండటంతో విద్యార్థులు లేక గుజరాత్ లోని చాలా స్కూళ్లను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

గుజరాత్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు కొన్ని విద్యార్థులు లేక మూతపడుతూనే ఉన్నాయి. అందులో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులున్న చోట విద్యార్థులు లేకపోవడం, విద్యార్థులు దండిగా ఉన్న చోట ఉపాధ్యాయుల కొరత కనిపిస్తుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూసివేతకు గురైన పాఠశాలల విద్యార్థులను సమీపంలోని మరో బడికి మార్చారు. ఉపాధ్యాయులను సమీపంలోని పాఠశాలలకు కేటాయించారు. ఇందులో భాగంగా కచ్ జిల్లాలోని 179 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులను ఇతర పాఠశాలలకు తరలించాలని అధికారలు నిర్ణయించారు.

ఒక్కో పాఠశాలలో 20 మంది విద్యార్థుల కంటే తక్కువ మంది విద్యార్థులతో ఉన్న హైస్కూళ్లను మూసివేయాలని గుజరాత్ విద్యా శాఖ అధికారులు ఆదేశించారు. అయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర పాఠశాలలకు మార్చాలని విద్యా శాఖ ఆదేశించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 179 పాఠశాలలను గుర్తించామని, అక్కడ ఉన్నత ప్రాధమిక విభాగాలు మూసివేయాల్సి వస్తుందని కచ్ జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి జె.పి.ప్రజాపతి తెలిపారు. విద్యార్థులను సమీపంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలకు మారుస్తున్నామని తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo