బుధవారం 08 జూలై 2020
National - Jun 19, 2020 , 12:29:43

పాఠశాలకు ‘గల్వాన్‌' వీరుని పేరు

పాఠశాలకు ‘గల్వాన్‌' వీరుని పేరు

రాయ్‌పూర్‌: లఢక్‌లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన గణేశ్‌ రామ్‌ కుంజం పేరను ఓ పాఠశాలకు పెడతామని ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌ ప్రకటించారు. సైనికుడు గణేశ్‌ రామ్‌ అంత్యక్రియలు ఈ రోజు రాయ్‌పూర్‌లో జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం బఘేల్‌లోపాటు మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ పాల్గొన్నారు.

అమరుడైన గణేశ్‌ రామ్‌ కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సహాయం సీఎం ప్రకటించారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఒక పాఠశాలకు గణేశ్‌ రామ్‌ పేరు పెడతామని తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

సోమవారం సాయంత్రం లఢక్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసున్న విషయం తెలిసిందే. చైనా సైనికులు కర్రలు, రాళ్లు, ఇనుప కడ్డీలతో భారత సైనికులపై విరుచుకు పడటంతో కల్నల్‌ ర్యాంకు స్థాయి అధికారి సహా 20 మంది మరణించగా, మరో 76 మంది గాయపడ్డారు. దీంతో ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రీక్త పరిస్థితులు నెలకొన్నాయి.  


logo