బుధవారం 20 జనవరి 2021
National - Oct 05, 2020 , 13:35:59

స్కూల్ టీచ‌ర్‌ను కాల్చిచంపిన దుండ‌గులు

స్కూల్ టీచ‌ర్‌ను కాల్చిచంపిన దుండ‌గులు

ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో హ‌త్య‌లు, అత్యాచారాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉన్న‌ది. అక్క‌డ ఇప్పుడు మ‌రో దారుణం జ‌రిగింది. విద్యార్థుల‌కు ట్యూష‌న్ చెప్పి బైకుపైన‌ తిరిగి ఇంటికి వెళ్తున్న ఉపాధ్యాయుడు సుధీర్‌కుమార్ (32)ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు తుపాకీతో కాల్చి పారిపోయారు. స్థానికులు అత‌డిని వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతిచెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాలోని బొపడా గ్రామంలో ఆదివారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది.

పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హ‌త్య‌కు కార‌ణాలు ఏమిట‌నే విష‌యం ఇంకా తెలియ‌రాలేద‌ని పోలీసులు చెప్పారు. హంత‌కుల కోసం గాలింపు చేప‌ట్టారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo