బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 03, 2020 , 16:04:49

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు

న్యూఢిల్లీ:  అంతర్జాతీయ  విమాన సర్వీసులపై కేంద్రం మరోసారి నిషేధాన్ని పొడిగించింది. జూలై  31 వరకు అంతర్జాతీయ  విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్టు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్ ‌(డీజీసీఏ)  ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో కొన్ని  ప్రయాణికుల విమాన సర్వీసులకు అనుమతించే అవకాశం ఉన్నదని తెలిపింది. 

కరోనా మహమ్మారి కారణంగా మార్చి 23 నుంచి  అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రాకపోకలను కేంద్రం నిలిపివేసింది.  రెండు నెలల విరామం తర్వాత మే 25 నుంచి దేశీయ ప్రయాణికుల విమానాలకు కేంద్రం అనుమతినిచ్చింది.  విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo