సోమవారం 06 జూలై 2020
National - Jun 19, 2020 , 02:12:00

అనుమతిస్తే జగన్నాథుడు క్షమించడు

అనుమతిస్తే జగన్నాథుడు క్షమించడు

  • జగన్నాథ రథయాత్రపై సుప్రీం కోర్టు స్టే

న్యూఢిల్లీ: ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న పూరి రథయాత్రపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ క్లిష్ట సమయంలో రథయాత్రకు అనుమతిస్తే ఆ జగన్నాథుడు తమను క్షమించడని వ్యాఖ్యానించింది. రథయాత్రను రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారిస్తూ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. 


logo