బుధవారం 27 మే 2020
National - May 13, 2020 , 14:09:40

స‌జ్జ‌న్ కుమార్‌కు బెయిల్‌ నిరాక‌రించిన సుప్రీం

స‌జ్జ‌న్ కుమార్‌కు బెయిల్‌ నిరాక‌రించిన సుప్రీం

హైద‌రాబాద్‌:  సిక్కుల ఊచ‌కోత కేసులో మాజీ ఢిల్లీ కాంగ్రెస్ నేత స‌జ్జ‌న్ కుమార్‌కు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. 1984 సిక్కుల ఊచ‌కోత కేసులో స‌జ్జ‌న్ కుమార్‌.. జీవిత‌కాల శిక్ష‌ను అనుభ‌విస్తున్నాడు. ఎయిమ్స్ డాక్ట‌ర్లు ఇచ్చిన వైద్య నివేదిక‌ను ప‌రిశీలించిన ధ‌ర్మాస‌నం.. స‌జ్జ‌న్‌కు హాస్పిట‌ల్ చికిత్స అవ‌స‌రం లేద‌ని పేర్కొన్న‌ది. చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. జూలైలో మ‌ళ్లీ కేసును విచారించ‌నున్న‌ట్లు సీజే తెలిపారు. సిక్కుల ఊచ‌కోత కేసులో నిందితులు బ‌ల్వాన్ కోకార్‌, మ‌హేంద‌ర్ యాద‌వ్‌ల‌కు కూడా పెరోల్ ఇచ్చేందుకు సుప్రీం బెంచ్ నిరాక‌రించింది.logo