సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 19, 2020 , 18:34:05

రేపు విశ్వాసపరీక్ష నిర్వహించండి..సుప్రీంకోర్టు ఆదేశాలు

రేపు విశ్వాసపరీక్ష నిర్వహించండి..సుప్రీంకోర్టు ఆదేశాలు

భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీలో రేపు విశ్వాస పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, విశ్వాస పరీక్షను వీడియో తీయాలని కోర్టు నిర్దేశించింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల్లోగా సీఎం కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వాసపరీక్షను ముగించాలని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పును ప్రతిపక్ష పార్టీ నేతలు స్వాగతించారు. 

మార్చి 16న  అసెంబ్లీలో సీఎం కమల్ నాథ్ ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష జరగాల్సి ఉండగా..కరోనా వైరస్ నేపథ్యంలో స్పీకర్ ప్రజాపతి  అసెంబ్లీని మార్చి 26 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో విశ్వాస పరీక్ష వాయిదా పడిన విషయం తెలిసిందే. 

logo