గురువారం 16 జూలై 2020
National - Jun 16, 2020 , 16:32:23

కేంద్రం, ఐఆర్‌డీఏకు సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్రం, ఐఆర్‌డీఏకు సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: మానసిక అనారోగ్యానికి గురైన వారికి చికిత్సలందించేందుకు బీమా వర్తింపజేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వం, బీమా రెగ్యులరేటరి అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏకు నోటీసులు జారీ చేసింది. న్యాయవాది గౌరవ్‌కుమార్‌ వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్‌ నారిమన్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం మంగళవారం వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించింది.

ఈ మేరకు మానసిక సమస్యలకూ బీమా కవరేజ్‌ను ఎందుకు వర్తింపచేయరాదో బదులివ్వాలని కేంద్రం, ఐఆర్‌డీఏను బెంచ్‌ కోరింది. అనంతరం విచారణను విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది. కాగా, బీమా పాలసీల్లో మానసిక అస్వస్థతకూ బీమా భద్రత కల్పించేలా కేటాయింపులు చేపట్టాలని 2018లో ఐఆర్‌డీఏ కంపెనీలను ఆదేశించింది. అదే ఏడాది శారీరక అనారోగ్యానికి అవసరమయ్యే చికిత్సల తరహాలో మానసిక అనారోగ్యానికి బీమా వర్తింపజేయాలని బీమా సంస్థలకు సర్క్యులర్‌ జారీ చేసింది.


logo