శనివారం 29 ఫిబ్రవరి 2020
నిర్భ‌య కేసు.. కోర్టులో సొమ్మ‌సిల్లిన జ‌స్టిస్ భానుమ‌తి

నిర్భ‌య కేసు.. కోర్టులో సొమ్మ‌సిల్లిన జ‌స్టిస్ భానుమ‌తి

Feb 14, 2020 , 15:09:29
PRINT
నిర్భ‌య కేసు.. కోర్టులో సొమ్మ‌సిల్లిన జ‌స్టిస్ భానుమ‌తి

హైద‌రాబాద్‌:  నిర్భ‌య కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు జ‌డ్జి ఆర్ భానుమతి.. కోర్టురూమ్‌లోనే సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు. నిందితుల‌ను వేరువేరుగా ఉరితీయాల‌ని కేంద్ర వేసిన పిటిష‌న్‌ను ఆమె ఇవాళ విచారించారు.  ఆ కేసులో వాదోప‌వాదాలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో జ‌డ్జి భానుమ‌తి కోర్టులోనే కొన్ని నిమిషాల పాటు సొమ్మ‌సిల్లిపోయారు. ఆమెను హుటాహుటిన చాంబ‌ర్‌లోకి తీసుకువెళ్లారు.  వెంట‌నే ఆ కేసును వాయిదా వేస్తున్న‌ట్లు బెంచ్ ప్ర‌క‌టించింది. ఆర్డ‌ర్‌ను త్వ‌ర‌లో రిలీజ్ చేస్తామ‌న్నారు.  జ‌స్టిస్ భానుమ‌తికి తీవ్ర జ్వ‌రం ఉన్న‌ద‌ని, చాంబ‌ర్‌లో డాక్ట‌ర్లు ఆమెను ప‌రిశీలిస్తున్నార‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా తెలిపారు.  మ‌రోవైపు నిర్భ‌య కేసులో దోషిగా ఉన్న విన‌య్ కుమార్ శ‌ర్మ పెట్టుకున్న క్ష‌మాభిక్ష పిటిష‌న్‌ను కోర్టు కొట్టిపారేసింది.  వైద్య నివేదిక‌ల ప్ర‌కారం విన‌య్ మాన‌సికంగా స్థిరంగా ఉన్న‌ట్లు సుప్రీంకోర్టు చెప్పింది.   


logo