గురువారం 21 జనవరి 2021
National - Dec 18, 2020 , 14:00:17

బెంగాల్ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

బెంగాల్ ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

న్యూఢిల్లీ: ప‌శ్చిమ‌బెంగాల్‌లోని మ‌మ‌తా బెన‌ర్జి ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. త‌మ‌పై బెంగాల్ స‌ర్కారు త‌ప్పుడు కేసులు న‌మోదు చేసి వేధిస్తున్న‌దంటూ అక్క‌డి బీజేపీ నేత‌లు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం.. మ‌మ‌త స‌ర్కారుకు నోటీసులు ఇవ్వ‌డ‌మేగాక‌ 2021 జ‌న‌వ‌రిలో తాము తదుప‌రి విచార‌ణ చేప‌ట్టే వ‌ర‌కు బీజేపీ నేత‌ల‌పై ఎలాంటి బ‌వ‌లంత‌పు చ‌ర్య‌లు చేప‌ట్ట‌రాద‌ని ఆదేశాలు జారీచేసింది. 

ప‌శ్చిమ‌బెంగాల్ స‌ర్కారు త‌మ‌పై త‌ప్పుడు కేసులు న‌మోదు చేసిందంటూ బీజేపీ ఎంపీలు కైలాస్ విజ‌య‌వర్గీయ‌, అర్జున్‌సింగ్‌, మరికొంద‌రు సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఈ పిటిష‌న్‌పై శుక్ర‌వారం జ‌స్టిస్ సంజ‌య్ కిష‌న్ కౌల్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రి స‌భ్య ధ‌ర్మాస‌నం విచార‌ణ ప్రారంభించింది. త‌దుప‌రి విచార‌ణ 2021 జ‌న‌వ‌రికి వాయిదా వేసింది. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo