బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 15:33:08

ఇ-వాహ‌న్ డేటాపై కేంద్రానికి మ‌రింత గ‌డువిచ్చిన సుప్రీం

ఇ-వాహ‌న్ డేటాపై కేంద్రానికి మ‌రింత గ‌డువిచ్చిన సుప్రీం

ఢిల్లీ : భార‌త్ స్టేజ్ ‌(బీఎస్‌) - IV వాహ‌నాల రిజిస్ర్టేష‌న్‌కు సంబంధించి వాహ‌న్ డేటా అఫిడ‌విట్‌ను దాఖ‌లు చేసేందుకు కేంద్రానికి సుప్రీంకోర్టు మ‌రింత గ‌డువు ఇచ్చింది. అదేవిధంగా ఆఫ్రిక‌న్ దేశాల‌కు ఎగుమ‌తుల‌ను అనుమ‌తించాల‌న్న ఎఫ్ఏడీఏ విజ్ఞ‌ప్తిని తిర‌స్క‌రించింది. 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి వ‌చ్చే బీఎస్‌-4 వాహ‌నాల అమ్మ‌కం, రిజిస్ర్టేష‌న్‌కు అనుమ‌తి ఇవ్వ‌కూడ‌ద‌నే నిర్ణ‌యాన్ని పునఃప‌రిశీలించాల్సిందిగా కోరుతూ ఆటో డీల‌ర్ అసోసియేష‌న్ ఎఫ్ఏడీఏ సుప్రీం కోర్టు త‌లుపు త‌ట్టింది. నేటి విచార‌ణ సంద‌ర్భంగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్పందిస్తూ... బీఎస్ VI గడువు గురించి తయారీదారులకు ముందే తెలుసునని, అందువల్ల వారు వాహనాలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది. కేసు తదుపరి విచారణను ఈ నెల 31వ తేదీకి వాయిదా వేసింది. 


logo