సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 01:56:56

‘దేశద్రోహం’పై విచారణకు నిరాకరణ

‘దేశద్రోహం’పై విచారణకు నిరాకరణ

న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కర్ణాటకలోని షాహీన్‌ స్కూల్‌లో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా నాటకం ప్రదర్శించినందుకు పాఠశాల యాజమాన్యం, సిబ్బందిపై దేశద్రోహం కేసును నమోదుచేయడంపై హక్కుల కార్యకర్త యోగిత భయన పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు చిన్నారి విద్యార్థులను కూడా ప్రశ్నించారని చెప్పారు. ఈ కేసులోని ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని అభ్యర్థించారు. ప్రభుత్వాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌లు ఏఎం ఖాన్‌విల్కర్‌, దినేశ్‌ మహేశ్వరి శుక్రవారం విచారణ జరిపారు.  మీరు బాధితులు కాదు కదా అని ప్రశ్నిస్తూ ఆ పిటిషన్‌ను తిరస్కరించారు. 


logo